చంద్రబాబుతో గౌతమ్ అదానీ భేటీ
AP: సీఎం చంద్రబాబుతో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన భేటీలో మంత్రి లోకేష్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అదానీ గ్రూపు చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై చర్చించారు. రానున్న రోజుల్లో పెట్టబోయే పెట్టుబడులపై మాట్లాడారు.