మూఢనమ్మకాలపై అవగాహన సదస్సు

మూఢనమ్మకాలపై అవగాహన సదస్సు

WGL: వర్ధన్నపేట మండలం ఇల్లందలో పోలీసుల ఆధ్వర్యంలో జనవిజ్ఞాన వేదిక హన్మకొండ వారితో మూఢనమ్మకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజలలో శాస్త్రీయ ఆలోచనలను, హేతువాదాన్ని పెంపొందించే లక్ష్యంతో సదస్సు నిర్వహించారు. సమాజంలో లోతుగా పాతుకుపోయిన మూఢనమ్మకాల వలన కలిగే నష్టాలను వివరించడం, వాటిని దూరం చేయడానికి ప్రతి ఒక్కరూ శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలన్నారు.