VIDEO: హనుమాన్ ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి
KNR: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్ హనుమాన్ ఆలయంలో చిన్న జయంతి వేడుకల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వంటలు చేస్తున్న సమయంలో వెలువడిన పొగకు.. సమీపంలోని తేనెటీగలు ఒక్కసారిగా భక్తులపై దాడి చేశాయి. ఈ ఘటనలో ఐదుగురు భక్తులకు గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన ఆలయ నిర్వాహకులు, స్థానికులు బాధితులకు ప్రథమ చికిత్స అందించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.