ఆగస్టు 22న జిల్లాస్థాయి సీనియర్స్ యోగా పోటీలు

KNR: ఈనెల 22న ప్రాంతీయ క్రీడా పాఠశాల యోగా హాల్లో జిల్లాస్థాయి సీనియర్స్ యోగాసన ఎంపిక పోటీలు నిర్వహించన్నుట్లు యోగా అసోసియేషన్ కార్యదర్శులు సర్దార్ రవీందర్ సింగ్, నాగిరెడ్డి సిద్ధారెడ్డి తెలిపారు. 18ఏళ్లు నిండిన పురుషులు, మహిళలు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. 22న ఉ.9 గం.కు జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డుతో వచ్చి దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.