జిల్లాలో తగ్గుతున్న బత్తాయి సాగు

జిల్లాలో తగ్గుతున్న బత్తాయి సాగు

NLG: జిల్లాలో బత్తాయి సాగు క్రమంగా తగ్గుతోంది. 2010 వరకు దాదాపు 3.10 లక్షల ఎకరాల బత్తాయి తోటలు ఉంటే, ప్రస్తుతం అవి కాస్త 45 వేల ఎకరాలకు పడిపోవడం తీవ్రతను తెలియజేస్తోంది. స్థానికంగా మార్కెట్ సదుపాయం లేకపోవడం, మార్కెట్లో డిమాండ్ తగ్గిపోవడం, బత్తాయి ప్రాసెసింగ్ చేసి ఉత్పత్తులు విక్రయించే టెక్నాలజీ లేకపోవడం వంటి కారణాలతో బత్తాయి సాగు బాగా తగ్గిపోయింది.