అభివృద్ధి పనులు ప్రారంభం
JGL: పెగడపల్లి మండలం ఐతుపల్లి వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి కేటాయించిన ప్రభుత్వ స్థలంలో బుధవారం అభివృద్ధి పనులను పంచాయతీ పాలకవర్గ ఆధ్వర్యంలో ప్రారంభించారు. గ్రామ సమీపంలోని టేకుల బోరు వద్ద వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి కేటాయించిన స్థలంలో ప్రోక్లెన్ ద్వారా చదును చేసే పనులను ప్రారంభించారు. ఉప సర్పంచ్, మార్కెట్ డైరెక్టర్, రైతులు, తదితరులు ఉన్నారు.