రైతు అవగాహన సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే
VZM: భోగాపురం మండలం రావాడ గ్రామంలో “రాష్ట్రీయ గోకుల్ మిషన్” కింద ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్సా శిబిరం, రైతు అవగాహన సదస్సును మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే లోకం నాగ మాధవి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పశుసంవర్ధక రంగం రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు.