నేరేడుపల్లిలో 'రైతన్న- మీకోసం' కార్యక్రమం

నేరేడుపల్లిలో 'రైతన్న- మీకోసం' కార్యక్రమం

ప్రకాశం: పెద్ద చెర్లపల్లి మండలం నేరేడుపల్లిలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి హాజరయ్యారు. రైతు కుటుంబాలకు ఆదాయం పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.