ట్రైన్ తరలింపుతో 18KM అధిక ప్రయాణ భారం..!

HYD: నగరం నుంచి షాలిమార్ స్టేషన్ వెళ్లే 18046 రైలును చర్లపల్లికి తరలించడంతో HYD నగరం నుంచి దాదాపు 18 కిలోమీటర్ల దూరం అధికంగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో వ్యయ ప్రయాసలు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పాత బస్తీ ప్రాంతంలో ఉన్న పలువురు ఇబ్బందులు పడ్డట్లు రైల్వే దృష్టికి తీసుకెళ్లారు.