ఆదిలాబాద్‌లో రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలు
ADB: 10వ తెలంగాణ వింటర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ ఆదిలాబాద్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు సాయిని రవికుమార్ తెలిపారు. ఈ నెల 7న జిల్లా స్థాయి, 8, 9వ తేదీలలో రాష్ట్ర స్థాయి పోటీలు జరగనున్నాయన్నారు. పోటీల్లో పాల్గొనే వారి వయస్సు ప్రకారం 5 గ్రూపులుగా విభజించినట్లు తెలిపారు.