భాగస్వామ్య సదస్సుకు పటిష్ట ఏర్పాట్లు
VSP: నవంబర్ 14, 15న విశాఖ వేదికగా జరగనున్న భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లపై కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులతో సమీక్షించారు. మంగళవారం జరిగిన ఈ సమావేశంలో జేసీ కే. మయూర్ అశోక్, సీఐఐ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని, లోపాలు తలెత్తకుండా సీఐఐ ప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలన్నారు.