రైలు కిందపడి కార్మికుడు మృతి

రైలు కిందపడి కార్మికుడు  మృతి

PDPL: ఉత్తరప్రదేశ్‌లోని జైతాపూర్‌కు చెందిన వరుణ్ కుమార్ సింగ్(30) అనే యువకుడు కూలీ పని చేసేందుకు హైదరాబాద్‌కు వెళ్తున్న క్రమంలో రామగుండం రైల్వే స్టేషన్‌లో రైలు దిగే సమయంలో కాలుజారి పడిపోయాడు. వెంటనే రైలు కదలడంతో వరుణ్ కుమార్ అక్కడికక్కడే మరణించాడు. మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు.