శార్దూల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు

భారత క్రికెట్ జట్టు అనుభవం లేమితో ఇంగ్లండ్ సిరీస్‌ను ఎదుర్కొందని శార్దూల్ ఠాకూర్ పేర్కొన్నాడు. కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్, షమీ జట్టులో లేకపోవడం వల్ల యువ ఆటగాళ్లతో బరిలోకి దిగాల్సి వచ్చిందని చెప్పాడు. అయితే, ఈ సిరీస్ ద్వారా యువ ఆటగాళ్లు ప్రపంచానికి తమ సామర్థ్యాన్ని చాటిచెప్పారని పేర్కొన్నాడు. జట్టుపై నమ్మకం ఉంటే ఎలాంటి జట్టునైనా ఓడించగలమని గంభీర్ చెప్పినట్లు తెలిపాడు.