గంజాయి కేసులో పాత ముద్దాయి అరెస్టు

VZM: గత సంవత్సరం డిసెంబర్ నెలలో 117 కిలోల గంజాయి కేసులో బొలెరో వాహనంతో పట్టుబడిన కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని అరెస్టు చేసి శనివారం ఎస్.కోట కోర్టులో హాజరు పరిచారు. తాజాగా విశాఖ సెంట్రల్ జైలుకు తరలించినట్లు పట్టణ సీఐ నారాయణమూర్తి తెలిపారు. కేరళ కోర్టు న్యాయమూర్తి ఆదేశాల ప్రకారం ఎస్.కోట కోర్టులో ప్రవేశపెట్టినట్లు చెప్పారు.