స్పీడ్ లాక్ తొలగిస్తే మూడింతల జరిమానా!
TG: ప్రైవేట్ బస్సులు, భారీ గూడ్సు వాహనాల ప్రమాదాలు తగ్గించేందుకు రవాణా శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. వాహనాలకు స్పీడ్ లాక్‌లు తొలగిస్తే.. మూడింతల జరిమానా విధిస్తామని అధికారులు స్పష్టం చేశారు. టిప్పర్ వంటి భారీ వాహనాలు పరిమితికి మించి లోడును తరలిస్తే.. వాహనాల స్వాధీనంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్, పర్మిట్ రద్దు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.