జిల్లా పోలీసు శాఖలో 'హంటర్'

జిల్లా పోలీసు శాఖలో 'హంటర్'

జిల్లా పోలీసు శాఖను మరింత బలోపేతం చేసేందుకు శనివారం నూతన జాగిలం 'హంటర్' పోలీసు శాఖకు చేరింది. నేరాల ఛేదనలో, నేరస్థులను పట్టించడం, పేలుడు పదార్థాల గుర్తింపులో 10 నెలల శిక్షణ పొందిన హంటర్ను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరిశీలించారు. డాగ్ స్క్వాడ్‌ను బలోపేతం చేస్తుందని, ప్రస్తుతం స్క్వాడ్ సంఖ్య 9కు పెరిగిందని ఆయన పేర్కొన్నారు.