466 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశాం: ఎస్పీ

నాగర్ కర్నూల్: జిల్లాలో మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు సీఈఐఆర్ విధానం ద్వారా తిరిగి ఫోన్ అప్పగించామని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న 22 పోలీస్ స్టేషన్లలో ఇప్పటివరకు 466 మొబైల్ ఫోన్లను ట్రేస్ అవుట్ చేసి బాధితులకు ఇచ్చామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఫోన్ పోగొట్టుకున్న వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.