రోడ్డుపై గుంతలు.. తప్పని ఇబ్బందులు

ADB: ఉట్నూర్ మండలంలో రోడ్డుపై గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారింది. మండలంలోని తాటి గూడ సమీపంలో మంచిర్యాల వెళ్లే మార్గంలో వంతెన వద్ద పెద్ద గుంతలు ఏర్పడటంతో వచ్చి పోయే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. గత ఏడాది ఇంతకు ముందు ఉట్నూర్ ఎస్సై గా పని చేసిన మనోహర్ మొరం వేసి గుంతలు పూడ్చారు.