విదుర నీతి: నమ్మకస్తులను కూడా అతిగా నమ్మకండి
నమ్మకూడని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదు. ఎంతో నమ్మకస్తులైన వారిని కూడా 'అతిగా' నమ్మకూడదని విదురుడు హెచ్చరించారు. ఆ గుడ్డి నమ్మకం వల్ల భవిష్యత్తులో ఏదైనా మోసం జరిగితే, ఆ దెబ్బకు మనిషి కోలుకోలేడు. ఆ అతి విశ్వాసమే ఓ వ్యక్తిని వేళ్లతో సహా సమూలంగా నాశనం చేస్తుంది. కాబట్టి ఎవరిపైనా గుడ్డి నమ్మకం పనికిరాదని, అప్రమత్తంగా వ్యవహరించడమే శ్రేయస్కరమని విదుర నీతి సారాంశం.