సుందరీకరణ పనులను ప్రారంభించిన మంత్రి సీతక్క

MLG: జంగాలపల్లి జంక్షన్ వద్ద సుందరీకరణ బిట్-3 పనులను మంత్రి సీతక్క శుక్రవారం రాత్రి ప్రారంభించారు. సుమారు రూ.69 లక్షలతో జంగాలపల్లి జంక్షన్ అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. జంక్షన్ వద్ద రామప్ప విశిష్ఠతను తెలిపే నందీశ్వరుడు, ఢమరుకం, రామప్ప నాగిని విగ్రహాలను ఏర్పాటు చేశారు. దీంతో జంగాలపల్లి జంక్షన్ కొత్త శోభను సంతరించుకుంది.