కనువిందు చేస్తున్న పార్కు అందాలు

NLG: రాంనగర్, రాజీవ్ పార్కులు పచ్చదనంతో నిండిపోయి ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. వేసవి నేపథ్యంలో పార్కులలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనడంతో జిల్లా వాసులు సాయంత్రం వేళ వచ్చి సేద తీరుతున్నారు. అందమైన పూల మొక్కలు, రాత్రి వేళ LED వెలుగులు, పిల్లలు ఆడుకోవడానికి ఆటస్థలం, కూర్చోవడానికి సిట్టింగ్, ఓపెన్ జిమ్‌లు ఉండటంతో ప్రజలు పార్కుకి రావడానికి ఆసక్తి చూపుతున్నారు.