VIDEO: బిక్కనూరులో 'ముందస్తు' ఎండల దెబ్బ
KMR: బిక్కనూరులో వేసవి కాలానికి ముందే భూగర్భజలాలు అడుగుంటుతుండటంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. సాగు చేసిన పంటలకు నీరు అందక పొలాలు ఎండిపోతున్నాయి. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో వరి పంటలు సాగు చేసిన రైతులు.. బోర్లలో నీటిమట్టం పడిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్టుబడి పెట్టిన పంటలు చేతికి వస్తాయో లేదోనన్న భయం వారిని వెంటాడుతోంది.