తాడిపత్రి ప్రభుత్వాసుపత్రిలో నూతన యూనిట్ల ప్రారంభం

తాడిపత్రి ప్రభుత్వాసుపత్రిలో నూతన యూనిట్ల ప్రారంభం

ATP: తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి సోమవారం ప్రభుత్వ ఆసుపత్రిలో డిజిటల్ ఎక్స్‌రే, ఐసీయూ మానిటర్ యూనిట్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి బయట మూత్రశాలలు కట్టిస్తామని హామీ ఇచ్చారు. డాక్టర్లు, సిబ్బంది ఆసుపత్రి అభివృద్ధికి సహకరించాలని కోరారు.