'రాకాస' నుంచి 'స్నేక్ డ్యాన్స్' సాంగ్ రిలీజ్
నిహారిక కొణిదెల నిర్మాణంలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన చిత్రం ‘రాకాస’. ఏప్రిల్ 3న విడుదల కానున్న ఈ సినిమా నుండి తాజాగా ‘స్నేక్ డ్యాన్స్’ అనే ప్రమోషనల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, గెటప్ శ్రీనులతో కలిసి నిహారిక వేసిన స్టెప్పులు హైలెట్‌గా నిలిచాయి. మానస శర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.