నష్టపోయిన రైతులను ఆదుకుంటాం: ఎమ్మెల్సీ

ASF: వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ తెలిపారు. శుక్రవారం దహేగాం మండలంలోని వివిధ గ్రామాల్లో నష్టపోయిన పంటలను పరిశీలించి రైతులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. పంట నష్టపోయిన రైతులకు పది వేల రూపాయలు ప్రభుత్వం నుండి ఇప్పించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.