ప్రత్యేకంగా ఆకట్టుకున్న భరతనాట్యం
CTR: పుంగనూరు పట్టణంలోని బజారు వీధిలో వెలసిన శ్రీ కోదండ రామాలయం ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రెండో రోజు శనివారం రాత్రి పలమనేరు చెందిన సాయి శ్రీ కూచిపూడి అకాడమీ వారిచే భరతనాట్య కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు చుట్టుపక్కల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.