VIDEO: ఈనెల 17న నులి పురుగుల మాత్రలు పంపిణీ
కోనసీమ: పిల్లల ఎదుగుదలకు నులి పురుగుల నివారణ మాత్రలు ఎంతో అవసరమని మామిడికుదురు మండల తహసీల్దార్ పీ.సునీల్ కుమార్ అన్నారు. మామిడికుదురు మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 17న 19 ఏళ్ల లోపు వారందరికీ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.