'వేలాడుతున్న విద్యుత్ స్తంభాలను సరి చేయాలి'
AKP: నర్సీపట్నం మండలం వేములపూడి నుంచి కోటవురట్ల మండలం అన్నవరం వెళ్లే రహదారిపై విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా వేలాడుతూ కనిపిస్తున్నాయి. కొంతకాలంగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా అధికారులు స్పందించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉందని, వెంటనే విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.