రహదారిపై దట్టమైన పొగ.. తీవ్ర ఇబ్బందులు

రహదారిపై దట్టమైన పొగ.. తీవ్ర ఇబ్బందులు

W.G: పెనుమంట్ర మండలం మార్టేరు హిందూ శ్మశాన వాటిక పక్కన ఉన్న డంపింగ్ యార్డుకు పారిశుద్ధ్య సిబ్బంది నిప్పు పెట్టడంతో మార్టేరు-ఆచంట రహదారిపై దట్టమైన పొగ వ్యాపించింది. దీనివల్ల ఎదురెదురుగా వచ్చే వాహనాలు కూడా కనిపించక, వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనీపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.