VIDEO: మూడు రోజుల పాటు అర్బన్ స్థాయి క్రీడ పోటీలు

NZB: యువతకు విద్యతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని ఆర్మూర్ ZPHS బాలుర పాఠశాల GHM కన్వీనర్ లక్ష్మీ నర్సయ్య ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్మూర్ అర్బన్ స్థాయి క్రీడాపోటీలు ఈనెల 10,11,12 తేదీల్లో ZP బాలుర పాఠశాలలో జరగనున్నాయన్నారు. క్రీడల నేపథ్యంలో తమ పాఠశాల సంసిద్ధంగా ఉందన్నారు. క్రీడలు ఆడటం వల్ల విద్యార్థులలో మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు.