BRS నేతలపై విరుచుకుపడిన MP రఘువీర్

NLG: జిల్లా ఎంపీ రఘువీర్ రెడ్డి BRS నేతలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రైతుల బాధలను రాజకీయ లబ్ధికోసం వాడుకుంటున్నారని విమర్శించారు. యూరియా సమస్యపై శవాల మీద పేలాలు ఏరుకునేలా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మిర్యాలగూడలో MLA గన్‌మెన్ యూరియాను పక్క దారి పట్టించడాన్న వార్తల్లో నిజం లేదని, అవి BRS నేతల కుట్రల ముసుగులో చేపట్టిన దుష్ప్రచారమని ఆరోపించారు.