సెలవులు రద్దు..అందరూ అందుబాటులో ఉండాలి

సెలవులు రద్దు..అందరూ అందుబాటులో ఉండాలి

కృష్ణా: వరద పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగులందరికీ సెలవులు రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. అందరూ తప్పనిసరిగా వారి ప్రధాన కార్యస్థానాల్లో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన నాగాయలంక, ఎదురుమొండి దీవుల్లో పర్యటించారు. మీడియాతో మాట్లాడుతూ.. వరద నేపథ్యంలో ప్రభావిత గ్రామాలకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.