వేట్లపాలెం ఘటన బాధాకరం: సీఎం చంద్రబాబు

వేట్లపాలెం ఘటన బాధాకరం: సీఎం చంద్రబాబు

AP: వేట్లపాలెం ఘటనలో 26 మంది చనిపోవడం బాధాకరమని CM చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యశ్రీ ఫైర్‌వర్క్స్‌కు YCP హయాంలో అనుమతి ఇచ్చారని, నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా తయారు చేస్తున్నారని మండిపడ్డారు. పరిమితికి మించి మందుగుండు నిల్వ చేశారని, నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. బాధితులకు ఇండ్లు కట్టిస్తామని తెలిపారు.