WBBLలో మెగ్ లాన్నింగ్ విధ్వంసం
మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ ఓపెనర్ మెగ్ లాన్నింగ్ చెలరేగిపోయింది. కేవలం 74 బంతుల్లో 22 ఫోర్లు, 4 సిక్సర్లతో భారీ శతకం(135) బాదింది. ఇది టోర్నీ చరిత్రలోనే మూడో అత్యధిక వ్యక్తిగత స్కోర్. అలాగే, WBBLలో అత్యధికంగా 35 హాఫ్ సెంచరీలు చేసిన రెండో ప్లేయర్‌గా కూడా నిలిచింది. కాగా, IPLలో ఆమె ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది.