రేపు అంతర్ జిల్లాల మహిళ హాకీ ఎంపిక పోటీలు

రేపు అంతర్ జిల్లాల మహిళ హాకీ ఎంపిక పోటీలు

AKP: రాష్ట్రస్థాయిలో జరిగే మహిళ హాకీ టోర్నమెంట్‌కు అంతర్ జిల్లాల ఎంపిక పోటీలు రేపు ఎలమంచిలిలో జరుగుతాయని జిల్లా హాకీ అసోసియేషన్ కన్వీనర్ కే.నరేష్ తెలిపారు. 2007 జనవరి ఒకటో తేదీ తర్వాత జన్మించినవారు ఈ పోటీలకు అర్హులుగా పేర్కొన్నారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జరిగే ఈ పోటీలకు ఆధార్ కార్డులు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.