పాఠశాల అభివృద్ధికి దాతల సహకారం అభినందనీయం

నల్గొండ: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు సహకరించి అభివృద్ధి చేయాలని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం సూర్యాపేట మండలం కాసరాబాద్లోని ప్రవాస భారతీయుడు ఉప్పల కిరణ్ కుమార్ రూ.2లక్షల నిధులతో ఏర్పాటు చేసిన మరుగుదొడ్లను ప్రారంభించి మాట్లాడారు. పాఠశాల అభివృద్ధికి దాతల సహకారం ఎంతో అభినందనీయమన్నారు.