VIDEO: పామర్రు ఎమ్మెల్యే హెచ్చరిక
కృష్ణా: పామర్రులో ప్రతి అర్హుడికి మూడు సెంట్ల ఇళ్ల స్థలం కేటాయించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని మాజీ శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ హెచ్చరించారు. పేదల ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకపోతే ప్రజలతో కలిసి ఉద్యమం చేపడతానని తెలిపారు.