త్వరలో జిల్లా మీసేవ యూనియన్ ఎన్నికలు

త్వరలో జిల్లా మీసేవ యూనియన్ ఎన్నికలు

నిజామాబాద్ జిల్లా మీసేవ యూనియన్ ఎన్నికలను ఈనెల చివరి వారంలో నిర్వహించనున్నట్లు మీసేవ ఎలక్షన్ కమిటీ నిర్ణయించినట్లు ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి గాను జిల్లాలోని ప్రతి మీ సేవ నిర్వాహకుడి వద్దకు వెళ్లి తమ అభిప్రాయాలను తెలుసుకుని వారందరి కోరిక మెరకు జిల్లాల్లో ఒకటే మీసేవ యూనియన్ ఉండేలాగా ఈ ఎన్నికలు జరుపనున్నట్లు తెలిపారు.