VIDEO: కనిగిరిలో వందేమాతర గీతాలాపన
ప్రకాశం: వందేమాతర గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కనిగిరి పోలీస్ స్టేషన్ ఆవరణలో డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ ఆధ్వర్యంలో వందేమాతర గీతాలాపన కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు వందేమాతర గీతాలాపన చేశారు. బంకించంద్ర ఛటర్జీ రాసిన వందేమాతర గీతం గొప్పతనాన్ని విద్యార్థులు తెలుసుకోవాలని డీఎస్పీ సూచించారు.