ప్రతి కుటుంబానికి అండగా ఉంటాం: మంత్రి

ప్రతి కుటుంబానికి అండగా ఉంటాం: మంత్రి

W.G: తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం ఆదివారం నిత్యావసరాలు పంపిణీ చేసింది. లక్ష్మీపాలెంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొని 175 కుటుంబాలకు సహాయం అందించారు. గత వైసీపీ ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తే, కూటమి ప్రభుత్వం సంక్షేమం అందిస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. నష్టపోయిన ప్రతికుటుంబానికి అండగా ఉంటామన్నారు.