నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం

నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం

హైదరాబాద్‌లో డ్రగ్స్ మరో‌సారి కలకలం రేపాయి. నాగోల్‌లో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, వారి నుంచి 26 గ్రాముల MDMA, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో నగరంలో డ్రగ్స్ నెట్‌వర్క్ కొనసాగుతుందని చెప్పడానికి సంకేతంగా కనిపిస్తోంది. దీనిపై పోలీసులు విచారణ కొనసాగిస్తూ, మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.