వైకుంఠ ఏకాదశి.. తిరుమలలో ఉన్నతస్థాయి సమీక్ష

వైకుంఠ ఏకాదశి.. తిరుమలలో ఉన్నతస్థాయి సమీక్ష

AP: తిరుమలలో ఈనెల 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు భద్రతా ఏర్పాట్లపై టీటీడీ అధికారులు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం, తిరుపతి ఎస్పీ పాల్గొన్నారు. వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విభాగాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.