యూరియా కోసం రైతుల నిరీక్షణ

NGKL: పెద్దకొత్తపల్లి మండలంలో యూరియా కొరత రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. సొసైటీల వద్ద యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు రోజంతా బారులు తీరినా నిరాశే ఎదురవుతోంది. సరైన సమయంలో యూరియా వేయకపోతే పంటలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు స్పందించి, వెంటనే సరిపడా యూరియా సరఫరా చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.