కరీంనగర్‌కు కాళేశ్వరం జలాలు
TG: కాళేశ్వరం లింక్-2కు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదావరి జలాల ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. నంది పంపుహౌస్‌లో 2, 3 మోటార్లను అధికారులు ఆన్ చేశారు. నంది రిజర్వాయర్‌లోకి ఒక్కో మోటారు ద్వారా 3,150 క్యూసెక్కుల చొప్పున ఎత్తిపోస్తున్నారు. అక్కడి నుంచి కరీంనగర్ జిల్లా గాయత్రి పంప్‌హౌస్‌కు జంట సొరంగాల ద్వారా తరలిస్తున్నారు. 3 రోజుల పాటు ఈ జలాలను తరలించనున్నారు.