ప్రయాణికులకు అలర్ట్.. జిల్లా మీదుగా నడిచే రైళ్లు రద్దు..!
శ్రీకాకుళం జిల్లా రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. జిల్లా మీదుగా నడిచే విశాఖ - బ్రహ్మపూర్ - విశాఖ (18525/26) ఎక్స్‌ప్రెస్ రైలు, విశాఖ - భువనేశ్వర్ - విశాఖ (22819/20) ఎక్స్‌ప్రెస్ రైలు అలాగే విశాఖపట్నం - బ్రహ్మపూర్ - విశాఖపట్నం (58531/32) ప్యాసింజర్ రైళ్లను ఈనెల 13, 14 తేదీలలో రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఆదివారం ప్రకటించారు.