అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే వినతి

అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే వినతి

SRD: జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని రామచంద్రాపురం, భారతి నగర్, పటాన్‌చెరు డివిజన్ల పరిధిలో మౌలిక వసతుల కల్పనకు, అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌ను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. ఈ మేరకు కార్యాలయంలో ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయి పలు అంశాలపై చర్చించారు.