లారీ ఢీకొని వృద్ధుడు మృతి

లారీ ఢీకొని వృద్ధుడు మృతి

VSP: జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సుమారు 70 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. పున్నమి రెస్టారెంట్ వద్ద రోడ్డు దాటుతుండగా అతివేగంగా వచ్చిన లారీ ఆయనను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో వృద్ధుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం తర్వాత లారీ డ్రైవర్ పరారయ్యాడు. భీమిలి ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.