రేవంత్ సర్కార్‌ది 'చోర్' మోడల్: కేటీఆర్
TG: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంపై కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వానిది క్యూర్, ప్యూర్ మోడల్స్ కాదని, అది 'చోర్' మోడల్ అని ఆరోపించారు. ఆరు గ్యారంటీల ఫైల్ గురించి అడిగితే సమాధానం లేదని, తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే సీఎం బూతులు తిడుతున్నారని విమర్శించారు. రేవంత్ మానసిక స్థితిపై తమకు అనుమానం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.