రఘునాథపల్లిలో సీపీఐ 'ఇంటింటికీ పార్టీ' కార్యక్రమం
JN: సీపీఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రఘునాథపల్లి మండల కేంద్రంలో ఇవాళ "ఇంటింటికీ సీపీఐ" కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ బలోపేతానికి, ప్రజా పోరాటాలకు మద్దతుగా పలువురు దాతలు ముందుకు వచ్చి సుమారు రూ. 10,000 విరాళాలు ఇచ్చారు.