VIDEO: యూరియా కోసం రైతుల ఇక్కట్లు

MBNR: కోయిలకొండ మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. శనివారం యూరియా వచ్చిందని సమాచారంతో రైతులు పెద్ద ఎత్తున తరలిరావడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. గత కొంతకాలంగా యూరియాకు కృత్తిమ కొరత ఏర్పడడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూర్తిస్థాయిలో యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.